Chandrababu | జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో అర్హత లేదు : ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu | హింసా, నేరప్రవృతి గల జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో అర్హత లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అమరావతి : హింసా, నేరప్రవృతి గల జగన్ (YS Jagan) లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో అర్హత లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu ) పేర్కొన్నారు. మెరుగైన సమాజం రావాలంటే మంచి రాజకీయ వేత్తలు అధికారంలో ఉండాలని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నాలుగోరోజున ఆయన అసెంబ్లీ హాల్లో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని (White Paper) విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచక , విధ్వంస పాలన కొనసాగిందని, శాంతి భద్రతలు కరువయ్యాయని అన్నారు.
ఈ సందర్భంగా ఐదేండ్ల వైఎస్ జగన్ పాలనలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, నేరాలకు సంబంధించిన అంశాలను చంద్రబాబు స్లైడ్ల ద్వారా వివరించారు. ప్రజాప్రతినిధులను కూడా ఎవరిని వదలలేదని ఆరోపించారు. జగన్ హయాంలో కేసులకు గురైన వారిని ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పెద్ద సంఖ్యలో పంపించారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులందరిపైన కేసులు పెట్టి హింసించారని తెలిపారు.
కోడెల శివప్రసాద్(Kodela Shiva Prasad) , రఘురామకృష్ణంరాజు, పవన్‌కల్యాణ్,అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థను కూడా వదల్లేదని ఆరోపించారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని అన్నారు. శాంతి భద్రతలు విఫలమయ్యారని వైసీపీ నేతలు ఢిల్లీలో నిరసన తెలుపడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను సక్రమంగా నిర్వర్తించడంపై పూర్తి బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. కూటమి పాలనలో నేరాలను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అరికడతామని స్పష్టం చేశారు.
Read more :
Murder and Suicide | తిరుపతిలో దారుణం.. వదినను, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మరిది
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

