Murder and Suicide | తిరుపతిలో దారుణం.. వదినను, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మరిది
Murder and Suicide | తిరుపతి పట్టణంలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి తాను మరిది ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన పట్టణంలోని పద్మావతి నగర్లో చోటు చేసుకుంది.
తిరుపతి : తిరుపతి (Tirupati) పట్టణంలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి (Murder) మరిది ఆత్మహత్యకు(Suicide) పాల్పడిన విషాద ఘటన పట్టణంలోని పద్మావతి నగర్లో చోటు చేసుకుంది. నెల్లూరు(Nellore) కు చెందిన గుడిమెట్ల తిరిపిదాస్ అనే వ్యక్తి రెండేళ్ల కిందట తిరుపతికి వచ్చి పద్మావతి నగర్లో భార్య సునీత, ఇద్దరు పిల్లలు దేవిశ్రీ, నీరజ తో కలిసి నివాసం ఉంటున్నాడు.
ప్రైవేట్ ఉద్యోగం చేసే తిరిపిదాస్కు మోహన్ అనే తమ్ముడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి 2019లో అన్నావదినలు వివాహం జరిపించారు. వివాదాల నేపథ్యంలో 2021లో మోహన్‌ను విడిచి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేశావంటూ తరుచూ అన్నతో గొడవ పడ్డ మోహన్ నిన్న రాత్రి వదినను, ఇద్దరు పిల్లలను గొంతుకోసం చంపి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటికి వచ్చి చూసిన అన్న తిరిపిదాస్ లోపలి దృశ్యాలను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్థానిక పోలీసులు, ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ రవిమనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

