Chandra Babu | టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన చంద్రబాబు
Chandra Babu | ఏపీలోని మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు.
అమరావతి : ఏపీలోని మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. మంగళవారం వెలువడ్డ ఎన్నికల్లో ఫలితాల్లో కూటమి ఘన విజయం దిశగా సాగుతుండడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న బాబుకు టీడీపీ(TDP) శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అభివాదం తెలుపుతూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అంతకుముందు హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాలను జరుపుకున్నారు. భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు, తదితరులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేనలు 175 స్థానాలున్నా అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు టీడీపీ 119 స్థానాలు, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించగా, 8చోట్ల అధికార వైసీపీ గెలుపొందింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

