Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana | బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల జీవోను సుప్రీం కోర్టు కొట్టివేయడం వైఎస్సార్సీపీ నాయకుడు , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
అమరావతి : బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల ( BC Reservations ) జీవోను సుప్రీం కోర్టు కొట్టివేయడం వైఎస్సార్సీపీ నాయకుడు , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) స్పందించారు. అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్‌పై జీవో తీసుకువచ్చి హైకోర్టు తప్పుపట్టడంతో సుప్రీం కోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు నిరాశే ఎదురైందని అన్నారు.
విజయనగరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.జీవోతో రిజర్వేషన్ రాదని తెలిసినా కోర్టులకు వెళ్లారని విమర్శించారు. జీవో కాదు. రాజ్యాంగ సవరణ చేయాలని మొదటి నుంచి చెప్తున్నామని వివరించారు. గత స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ పారిపోయింని ఆరోపించారు. బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇకనైనా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటుతో కాకుండా జీవితం గడపాలని సూచించారు.ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ కోర్టులో కేసు వేసిందని చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

