కర్ఫ్యూ ఎఫెక్ట్.. ఆంధ్రాలో మారిన బ్యాంకుల పని వేళలు
బ్యాంకుల పని వేళలు| ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. దీంతో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవడాని ప్రభుత్వం అనుమతిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. గురువారం నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకే బ్యాంకులు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత నానాటికీ అధికమవుతుండటంతో ప్రభుత్వం నివారణా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిన్నటి నుంచి రాష్ట్రంలో ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు చేస్తున్నది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు రెండు వారాలపాటు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దుండిగల్ ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీకి విఫలయత్నం
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
మళ్లీ 4 లక్షలు దాటిన కరోనా కేసులు.. 4 వేలకు చేరువలో రోజువారీ మరణాలు
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దులను మూసివేసిన ఛత్తీస్‌గఢ్
కరోనా వేళ.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

