Viral Video | మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మీ కాళ్లు పట్టుకుంటా.. నాకు గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్ అంటూ సెల్‌టవర్ ఎక్కి నానా రభసా చేశాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుమలగిరి కాలనీకి చెందిన ఉడుతల హనుమంతు అనే యువకుడు శనివారం మధ్యాహ్నం మద్యం మత్తులో 150 అడుగుల బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఎక్కాడు. దానిపై అనేక విన్యాసాలు చేస్తూ, దూకేస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఎస్సై దేవకుమార్ చాకచక్యంగా వ్యవహరించి, అతన్ని సెల్ టవర్‌పై నుంచి కిందకు దింపి అదుపులోకి తీసుకున్నాడు.
అయితే సెల్‌టవర్ ఎందుకు ఎక్కావని ఎస్సై ప్రశ్నించగా.. నాకు ఒక గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్.. నీ కాళ్లు పట్టుకుంటా అంటూ బతిమిలాడాడు. కాగా, పోలీసులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
నాకు ఒక గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్..!!
మీ కాళ్లు పట్టుకుంటా
గంజాయి కోసం సెల్ టవర్ ఎక్కి ఫీట్లు చేసిన యువకుడు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో మద్యం మత్తులో యువకుడు హనుమంతు హల్చల్
యువకుడితో చాకచక్యంగా మాట్లాడి, కిందికి దించి ఆసుపత్రికి తరలించిన… pic.twitter.com/utv0UI34p4
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2026