AP TET notification | రేపు ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల
AP TET notification | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ (AP TET ) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది. ఇందుకోసం విద్యాశాఖ రేపు( సోమవారం) టెట్ నోటిఫికేషన్(Notification ) విడుదల చేయనుంది. జులై 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. మిగతా వివరాలకు http://cse.ap.gov.in/ అనే వెబ్సైట్(Website) ను సంప్రదించాలని సూచించింది .
టెట్ ఫలితాల్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల వెల్లడించారు. ఆ తరువాత మెగా డీఎస్సీ ఉండబోతుందని తెలిపారు. ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామన్న హామీ మేరకు సోమవారం నాడు టెట్ పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు.
పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
కొత్త డీఎస్సీ నోటిఫికేషన్( DSC notification) త్వరలో విడుదల చేస్తుండడంతో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాత డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదివారం జీవో జారీ చేసింది. గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల(Teacher Posts) కు నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల మేనిఫెస్టో(Manifesto) లో ఇచ్చిన హామీ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది.
రెండు, మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు(Chandra Babu) ఈనెల 13న సీఎంగా బాధ్యతలు చేపట్టి డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

