AP TET 2024 | టీచర్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అలర్ట్.. టెట్ షెడ్యూల్లో కీలక మార్పులు!
AP TET 2024 | ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రిపరేషన్‌కు సమయం కావాలని అభ్యర్థులు చేసిన వినతిపై సానుకూలంగా స్పందించింది. పరీక్షకు మూడు నెలల సమయం ఇస్తూ షెడ్యూల్‌ను సవరించింది.
AP TET 2024 | ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రిపరేషన్‌కు సమయం కావాలని అభ్యర్థులు చేసిన వినతిపై సానుకూలంగా స్పందించింది. పరీక్షకు మూడు నెలల సమయం ఇస్తూ షెడ్యూల్‌ను సవరించింది. తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ నిర్వహించనున్నారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించి.. అక్టోబర్ 27న ఫైనల్ కీ ఇస్తారు. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఏపీలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే జూలై 2వ తేదీన టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ సమయం తక్కువగా ఉండటంతో ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాలని ఉద్యోగార్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌కు కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

