అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని ( శివనాథ్) చిన్ని (MP Keshineni Chinni) పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏపీ ఒలింపిక్ సంఘం (Olympic Association ) ఇంకా వైసీపీ నేతల కబ్జాలోనే ఉందని ఆరోపించారు.
అసోసియోషన్లోని నలుగురు వైసీపీ నాయకులు(YCP Leaders) అక్రమాలకు పాల్పడ్డారని, దాదాపు 340 కేసుల్లో అసోసియేషన్ చిక్కుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం మితిమీరిన రాజకీయ జ్యోం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా భూ అక్రమాలు జరిగాయని వివరించారు. అగ్రిగోల్డ్, దేవాదాయ, చెరువులు కూడా వేటినీ వైసీపి నాయకులు వదల్లేదని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి ప్రజలకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందు కృష్టాష్టమి వేడుకులో పాల్గొని పూజలు చేశారు.