AP Politics | ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. రాజ్యసభకు వైవీ సుబ్బారెడ్డి సహా ముగ్గురి ఎంపిక ?
AP Politics | ఏపీలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే టికెట్లను కూడా ప్రకటించేస్తున్నారు.
AP Politics | ఏపీలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే టికెట్లను కూడా ప్రకటించేస్తున్నారు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో టికెట్ దొరకని ఆశావహులు ఇతర పోస్టులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికలు కూడా దగ్గరికొస్తుండటంతో ఎవరికి సీటు దక్కుతుందా? అని అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక జగన్ కూడా ఎవరినీ నొప్పించుకుండా.. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జగన్ ముగ్గురి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు (ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాస్(బలిజ)లను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్‌లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీవిరమణ చేయనున్నారు. వారిలో ఏపీ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ నుంచి సీఎం రమేశ్‌బాబు పదవీకాలం ఏప్రిల్‌లో అయిపోతుంది. ఏప్రిల్ 2వ తేదీన వీరు పదవీవిరమణ చేయనున్నారు. ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ పరంగా ఈ మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికై కసరత్తు చేసిన వైసీపీ.. ముగ్గుర్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. దీంతో వేమిరెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గొల్ల బాబురావును ఎంపిక చేశారని సమాచారం. అలాగే బలిజ సామాజిక వర్గం నుంచి జంగాలపల్లి శ్రీనివాస్‌కు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ మూడు స్థానాల అభ్యర్థుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

