Nara Lokesh | కేటీఆర్‌ను కలిస్తే తప్పేంటి.. దానికి రేవంత్‌రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఇటీవల భేటీ కావడంపై కూడా ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. కేటీఆర్‌ను కలుస్తానని.. ఆయన్ను ఎందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు.
Nara Lokesh | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఇటీవల భేటీ కావడంపై కూడా ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. కేటీఆర్‌ను కలుస్తానని.. ఆయన్ను ఎందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానని గుర్తుచేశారు. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలా అని ప్రశ్నించారు.
తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో టీడీపీ పోటీపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. కవితను టీడీపీలోకి తీసుకోవడమంటే జగన్‌ను చేర్చుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో జగన్‌ను వైసీపీ ఎంపీలు అడగాలని నారా లోకేశ్ సూచించారు. ఇప్పుడే కాదు.. 2029 ఎన్నికల్లోనూ మోదీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు.
రెడ్‌బుక్‌లో చాలా స్కామ్‌లు ఉన్నాయని నారా లోకేశ్ అన్నారు. అవన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఆ భయంతోనే జగన్ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. ఏపీ లిక్కర్ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. ఫైబర్ నెట్‌ను టాటా సంస్థకు ఇచ్చే చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- KTR
- Nara Lokesh
- Red Book
RELATED ARTICLES
తాజా వార్తలు
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

