Anagani Satya Prasad | ఏమయ్యా జగన్! టీడీపీ అధికారంలోకి వచ్చిన నెలకే నీకు రాష్ట్రపతి పాలన కావాలా? ఏపీ మంత్రి సత్యప్రసాద్ సెటైర్లు
Anagani Satya Prasad | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ జగన్ చేసిన డిమాండ్‌పై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఏమయ్యా జగన్ రెడ్డి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే నీకు రాష్ట్రపతి పాలన కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు.
Anagani Satya Prasad | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ జగన్ చేసిన డిమాండ్‌పై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఏమయ్యా జగన్ రెడ్డి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే నీకు రాష్ట్రపతి పాలన కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. మీరు మాట్లాడే దానికి ఏమైనా అర్థం ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లలో ఏపీ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చింది మీరే కదా అని వైఎస్ జగన్‌పై అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఆనాడు మీకు రాష్ట్రపతి పాలన గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. మీకు 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు పశ్చాత్తాపపడేలా మీ తీరుందని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేసే ముందు ఆంధ్రాలోని గల్లీగల్లీలో నీ అరాచక పాలన అనవాళ్లకు కాళ్ల మీద పడి క్షమాపణ కోరితే ప్రజలు హర్షిస్తారని స్పష్టంచేశారు.
పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్తలే హత్య చేశారని జగన్ చేసిన ఆరోపణలపైనా మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. రషీద్‌ను జిలానీ చంపడానికి రాజకీయాలకు సంబంధంల ఏదని.. గంజాయి మత్తులోనే హత్య చేశాడని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారని చెప్పారు. తాను పెంచి పోషించిన గంజాయి మత్తులో చేసిన హత్యను టీడీపీ అంటగడుతూ జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిందితుడు జిలాని టీడీపీ నేతలతో దిగిన ఫొటోలతో ఉన్నాయని.. వాళ్లపై కేసులు ఎందుకు పెట్టలేదని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. అలా అయితే వైసీపీ హయాంలో జరిగిన అత్యాచార నిందితుల్లో సగం మంది జగన్‌తో సెల్ఫీలు దిగారని అన్నారు. వాళ్లతో పాటు జగన్‌పై కూడా రేప్ కేసులు పెట్టాలి కదా అని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

