అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి పవన్ ( Pawan Kalyan) ప్రవర్తనపై సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు నాలుగైదు సినిమా పేర్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల విడుదలైన బ్రో సినిమాలో మంత్రి అంబటిని అనుకరిస్తూ తీసిన నృత్యంపై ఘాటుగా స్పందించారు.
దురుద్దేశ పూర్వకంగానే తన పాత్రను సినిమాలో పెట్టారని విమర్శించారు. బ్రో (BRO )సినిమా ప్లాఫ్ కావడంతో రాజకీయ నాయకుల పేర్లను వాడుకుని సంచలనం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే కుట్రలో భాగంగానే పవన్ సినిమాలు వస్తున్నాయని పేర్కొన్నారు.బ్రో సినిమా నిర్మాత టీడీపీకి చెందిన వ్యక్తని ఆరోపించారు.
ఇక పవన్ తీరుపై సినిమా తీసేందుకు సిద్ధమైన టైటిళ్లను ఆయన ప్రకటించారు. నిత్య పెళ్లికొడుకు, తాళి-ఎగతాళి, బహుభార్య ప్రవీణుడు, మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.