IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. వీరిలో కొందరికి కొత్త పోస్టింగ్‌లు కల్పించగా.. మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. వీరిలో కొందరికి కొత్త పోస్టింగ్‌లు కల్పించగా.. మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. 2002 బ్యాచ్‌కు చెందిన సౌరభ్ గౌర్‌ను న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌కు ఓఎస్డీగా నియమించారు. 2006 బ్యాచ్‌కు చెందిన డి.మురళీధర్ రెడ్డిని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు. 2009 బ్యాచ్‌కు చెందిన మంజులే బాలాజీ దిగంబర్‌కు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ అదనపు సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఇక కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆమ్రపాలికి యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
యువజన సేవల డైరెక్టర్‌గా కె.నీలకంఠరెడ్డి.. పరిశ్రమలు, వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా బి.అనిల్ కుమార్ రెడ్డిని నియమించారు. ఏపీ గురుకులాల కార్యదర్శిగా ఎన్ తేజ్ భరత్ నియమితులయ్యారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖలో ఉప కార్యదర్శిగా గేదెల శ్రీను కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఎం.వరప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. కె.శ్రీనివాసులుకు ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ బాధ్యతలతో పాటు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా శుభం భన్సాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Ias Officers Postings
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Amrapali
- AP News
- IAS Transfers
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

