వైసీపీ హయాంలోని రహస్య జీవోలు బయటపెట్టండి.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నింటినీ బహిర్గతం చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఇచ్చిన రహస్య జీవోలు అన్నింటినీ జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారును ఆదేశించింది
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నింటినీ బహిర్గతం చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఇచ్చిన రహస్య జీవోలు అన్నింటినీ జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారును ఆదేశించింది ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీవోఐఆర్ వెబ్సైట్ 2008లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులు, జీవో కాపీలను అందులో అప్లోడ్ చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 మధ్య విడుదల చేసిన ఉత్తర్వులను మాత్రం సైట్లో అప్లోడ్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా జగన్ సర్కార్ జీవోలను రహస్యంగా ఉంచుతుందని అప్పటి ప్రతిపక్షాలపై టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ రహస్య జీవోలను బయటపెట్టాలని నిర్ణయించింది.
పారదర్శకత, సమాచారం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు పౌరులకు అందుబాటులో ఉండాల్సిందేనని జీఏడీ కార్యదర్శి సురేశ్‌కుమార్ తెలిపారు. అధికారిక నిర్ణయాలు జీవోల రూపంలో ప్రజలకు స్పష్టత ఇస్తాయని అన్నారు. అయితే మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడుతుందని తెలిపారు. అందుకే మూడేళ్ల కాలానికి సంబంధించిన జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

