రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్‌న్యూస్.. వంట నూనెల ధరలను భారీగా తగ్గించిన ఏపీ సర్కార్
పండుగవేళ సామాన్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పండుగవేళ సామాన్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో కిలో పామాయిల్ రూ.110, సన్‌ఫ్లవర్ నూనె రూ.124కే అందించాలని నిర్ణయించింది. ఈ ధరలు నేటి నుంచి ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామాయిల్, ఒక లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ చొప్పున మాత్రమే ఇవ్వనున్నారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధరల నియంత్రణపై చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు వివరించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా రాష్ట్రమంతటా ఒకే ధరపై విక్రయించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. దీనికి డీలర్లు, సప్లయర్స్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రతి రేషన్ కార్డుపై సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను గరిష్ఠంగా 124, పామాయిల్‌ను రూ.110కి విక్రయించేందుకు అంగీకరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

