YS Jagan | ఆస్తుల వివాదం.. తల్లి, చెల్లిపై పిటిషన్ వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
YS Jagan | తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ షేర్ల వివాదంపై క్లాసిక్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్, వైఎస్ జగన్, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
YS Jagan | తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ షేర్ల వివాదంపై క్లాసిక్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్, వైఎస్ జగన్, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ పిటిషన్లో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో పాటు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రార్ ఆప్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. తాము కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేశామని తెలిపారు. 2019 ఆగస్టు 21న ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని పేర్కొన్నారు. కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్లో ప్రస్తావించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్ వేయగా.. సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు, అక్టోబర్ 18న మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన ఎన్సీఎల్టీ.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- nclt
- ys jagan
- YS Sharmila
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

