AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగనున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. అనుకున్నదానికంటే కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు జగన్ సూచించారు.
తెలంగాణలో 20 రోజుల ముందే షెడ్యూల్ విడుదలయ్యిందని మంత్రులకు జగన్ గుర్తుచేశారు. ఏపీలోనూ ముందస్తుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే మంత్రులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని.. ఫిబ్రవరి మొదటివారంలోపే అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో జరగాల్సి ఉంది. కానీ తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.