శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమయింది

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమయింది. బుధవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. పుట్టమన్ను సేకరించి నవధాన్యాలు విత్తి వేడుకలకు అంకురార్పణ చేస్తారు. ఈ నెల 15 వరకు ఉత్సవాలు కొనసాగున్నాయి.
గురువారం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకనున్నారు. రేపు రాత్రి నిర్వహించనున్న పెదశేష వాహన సేవతో స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు విహరించనున్నారు.
ఈ నెల 15న రాత్రి ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ (TTD) అధికారులు రద్దు చేశారు.
బ్రహ్మోత్సవాలు ఇలా..
7న ధ్వజారోహణం, పెద్దశేష వాహనసేన
8న చిన్నశేష వాహనసేవ, రాత్రికి హంస వాహనసేవ
9న సింహ, ముత్యపు పందిరి వాహనసేవలు
10న కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు
11న మోహినీ అవతారం, గరుడ వాహనసేవ
12న హనుమంత, గజ వాహనసేవలు
13న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలు
14న సర్వభూపాల, అశ్వ వాహనసేవలు
15న పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం
15న రాత్రి ధ్వజారోహణ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

