TTD | తిరుమలలో బాలుడిపై చిరుత దాడి.. కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
TTD | తిరుమలలో ఐదేండ్ల చిన్నారిపై చిరుత దాడితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. చిరుతను పట్టుకునేందుకు గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు 30 కెమెరా ట్రాన్స్‌లు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల బోన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు.
TTD | తిరుమలలో ఐదేండ్ల చిన్నారిపై చిరుత దాడితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. చిరుతను పట్టుకునేందుకు గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు 30 కెమెరా ట్రాన్స్‌లు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల బోన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని టీటీడీ యోచిస్తోంది.
తిరుమలలో శుక్రవారం సాయంత్రం చిరుత దాడిలో గాయపడ్డ బాలుడు కౌశిక్‌ను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. అనంతరం చిరుత దాడి చేసి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసింది చిరుత పిల్ల కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత ఆ పిల్లాడిని వదిలేసి వెళ్లిందని పేర్కొన్నారు.
చిరుత దాడి నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత గాలిగోపురం నుంచి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపించేలా ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డు ఉంటారని అన్నారు. చిన్న పిల్లలు బృందం మధ్యలో ఉండేలా చూసుకోవాలని.. అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

