అమరావతి : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. బుజబుజ నెల్లూరు గ్రామంలో ఓ విద్యార్థినిపై యువకుడు కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత అమ్మాయిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యాసిడ్ దాడికి పాల్పడ్డ నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.