Chandrababu | చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు (ACB Court) ఇన్చార్జీ జడ్జి బుధవారానికి వాయిదా వేశారు.
హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు (ACB Court) ఇన్చార్జీ జడ్జి బుధవారానికి వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా, వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి అన్నారు. బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈ రోజు సెలవులో ఉన్నారు. దీంతో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇన్చార్జ్గా వ్యవహరించారు.
కాగా, చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో బుధవారం విచారణ రానుంది. తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అంగీకరించారు. ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి తెలియనుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

