అమరావతి : వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan ) అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో (Supreme Court ) కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు (Bail Cancell )చేయాలని, కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని కోరుతూ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్ ( Justice Sanjaykumar khanna) ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ ప్రారంభం కాగానే పిటిషన్ ఏపీకి చెందిందని జగన్ తరుఫు న్యాయవాది బెంచ్‌కు చెప్పారు. మారిన పరిస్థితుల్లో కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని సీబీఐ తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.
అయితే స్పందించిన జస్టిస్ సంజయ్‌కుమార్ ‘నాట్ బీఫోర్ మీ’ అనడంతో పిటిషన్లు మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా కేసును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వం వహించే ధర్మాసనం ముందుకు పంపాలని ఆదేశాలు జారీ చేస్తూ డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీకి ఆదేశించారు.