కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. 8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు.

బెంగళూరు: కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మృతిచెందారని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. వారంతా కూలీలని, పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

