కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనుకావడం కలకలం సృష్టించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనుకావడం కలకలం సృష్టించింది. జిల్లాలోని వీరబల్లి కస్తూర్బా పాఠశాల విద్యార్థినీలు కలుషిత ఆహారం తిని వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సుమారు 30 మంది అస్వస్థతకు గురికావడంతో వీరిని వీరబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న విద్యార్థినీల తల్లిదండ్రులు కస్తూర్బా పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు కలుషిత ఆహారం పెట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

