కరోనా కలకలం.. ఒకే ఇంట్లో 21 మందికి పాజిటివ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్నాడు. అతడు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కుటుంబ సభ్యులను దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్ వరావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత నాలుగు రోజులుగా వారు ఎవరెవరిని కలిశారనే విషయంపై ఆరాతీస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 758 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,92,984కు చేరింది. ఇదులో 8,82,314 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 3469 మంది చికిత్స పొందుతుండగా, 7201 మంది మరణించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

