Bus Fire Accident | కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లో గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరుకు చేరుకున్నది.
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లో గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరుకు చేరుకున్నది. ఈ క్రమంలో ఓ బైకును ట్రావెల్స్ బస్సు ఢీకొన్నది. అది బస్సు కింది భాగంలో చిక్కుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంలో బస్సు మొత్తానికి మంటలు వ్యాపించడంతో క్షణాల్లోనే కాలి బూడిదైంది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది ఎమర్జెన్సీ డోరు గుండా బయటకు వచ్చారు. మిగిలినవారు కాలిబూడిదయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో 11 మంది సజీవ దహనం అయ్యారు.
ఇప్పటి వరకు బస్సులోనుంచి 11 మృతదేహాలను వెలికి తీశామని కర్నూలు కలెక్టర్ సిరి వెల్లడిచారు. 20 మంది క్షేమంగా బయటపడ్డారని చెప్పారు. పలువురు మిస్ అయ్యారని తెలిపారు. కాగా, నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ బంధువులు ప్రమాద స్థలానికి వచ్చారు. రమేశ్ (35) సహా అతని కుటుంబ సభ్యులు అనూష (30), మన్విత (10), మనీశ్ (12) చనిపోయారు.
బస్సులో ప్రయాణిస్తున్న వారు..
అశ్విన్ రెడ్డి(36), జీ. ధాత్రి (27), కీర్తి (30), పంకజ్ (28), యువన్ శంకర్ రాజు (22), తరుణ్ (27), ఆకాశ్ (31), గిరిరావు (18), బున సాయి (33), గణేశ్ (30), జయంత్ పుష్వాహా (27), పిల్వామిన్ బేబి (64), కిశోర్ కుమార్ (41), రమేశ్ (30), అనూష (22), మహ్మద్ ఖైజర్ (51), దీపక్ కుమార్ (24), అన్డోజ్ నవీన్ కుమార్ (26), ప్రశాంత్ (32), ఎం సత్యనారాయణ (28), మేఘనాథ్ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), సూర్య (24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస్‌రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కే. అశోక్ (27), ఎంజీ రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్ కుమార్ (18), వేణుగోపాల్ రెడ్డి (24), రమేశ్ అని వ్యక్తితోపాటు అతని ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో 39 మంది పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం నుంచి బయపడిన వారిలో 19 మందిని గుర్తించామని, వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

