అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢికొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రాయదుర్గం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.