Bhendi Cultivation | బెండకాయలను వివిధ వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. వేపుడుగా, పులుసుగా ఉడకపెట్టి సలాడ్‌గా తీసుకోవచ్చు. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనిని పండిస్తారు. బెండకాయల్లో ఏ, బీ, సీ విటమిన్లతోపాటు అయోడిన్ ఎక్కువగా లభిస్తుంది. వీటిలొ ఫోలేట్, పిండి పదార్థాలు, పీచు పదార్థం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఉండి మనకు పోషకాలు అందిస్తాయి. బెండ వేర్లు, కాండం వచ్చిన రసంను శుభ్రపరచడానికి బెల్లం, చెక్కెర పరిశ్రమలలో వాడతారు. బెండను వ్యాపారపరంగా పండిస్తూ పెద్ద మొత్తంలో లాభాలను అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు కూడా ఎగుమతి చేసి లాభాలు ఆర్జించవచ్చు.
బెండ ఉష్టమండలపు పంట. చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. పగటి ఉష్ణోగ్రత 25-40 డిగ్రీల సెంటీగ్రేడ్.. రాత్రి 22 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువైతే పిందె కట్టడం తగ్గి పూత రాలి, దిగుబడులు తగ్గిపోతాయి. అందువల్ల ఈ పంట వానాకాలం, వేసవిలో పండించటానికి అనువైనది.
నేలలు
సారవంతమైన ఇసుక నేలలు మురుగు నీరు పోయే సౌకర్యం గల తేలిక పాటి నల్ల రెగడి నేలలు బెండ సాగుకు అనుకూలం. గుల్లగా ఉండే సారవంతమైనా ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి సాధించవచ్చు.
విత్తనం విత్తే పద్దతి
నేలలో 4-5 సార్లు బాగా దున్నాలి. వర్షా కాలం పంటను 60సేం. మీ ఎడం తో బోదెలు వేసి వాటికి 20-30 సేం. మీ. దూరంలో నాటుకోవాలి.వేసవి పంటను మాడులు తయారు చేసుకొని వరుసల మధ్యన 45 సేం. మీ. మొక్కల మధ్యన 15-20 సేం. మీ. ఉండేలా విత్తుకోవాలి.
ఎరువులు
చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియ దున్నలి.20 కేజీ ల భాస్వరం,20 కేజీ ల పోటాషియం నిచ్చే ఎరువులు కూడా ఆఖరి దుక్కిలో వేయాలి.45 కేజీల నత్రజని ఇచ్చే ఎరువులను సమభాగాలుగా 1/3 వంతును విత్తిన 30-45 రోజుల్లో వేయాలి.
నీటి యాజమాన్యం
వేసవిలో ప్రతి 5-6 రోజుల ఒకసారి నీటి తడులను ఇవ్వాలి. ఇక వానాకాలంలో నేలలోని తేమను బట్టి నీటి తడులు ఇవ్వాలని గుర్తుంచుకోవాలి.
కోత
విత్తు నాటిన 45-50 రోజులకు మొదటి కాత వస్తుంది. కాత కాసిన 4-6 రోజులకు కాయ కొస్తే నాణ్యత బాగుంటుంది. ప్రతి రెండు, మూడు రోజులకోసారి కాయలు కొయ్యాలి. లేదంటే కాయలు ముదిరి పనికి రాకుండా పోతాయి.
విత్తనోత్పత్తి
బెండ విత్తనోత్పత్తి కోసం రకాల మధ్య దూరం 40 మీటర్ల. వరకు ఉండడం అవసరం. బెండకాయలు బాగా పండిన తర్వాత విత్తనాన్ని వేరు చేయాలి.ఒక హెక్టారుకు సుమారు 10-20 క్వి 1-2 టన్నులు విత్తన దిగుబడి వస్తుంది.