మిరపకు తోడు కాలిఫ్లవర్

ఒక పంటకు మరో పంట తోడు. అంతర పంట విధానం.. రైతులకు అదనపు ఆదాయ మార్గం. కూరగాయలు పండించే రైతులు మిర్చిలో అంతర పంటగా కాలిఫ్లవర్ సాగు చేపడితే మంచి దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక వరుసలో మిర్చి, మరో వరుసలో కాలిఫ్లవర్ సాగు చేపట్టాలి. మిర్చి పంట దీర్ఘకాలికమైనది. ఏడాదిపాటు సాగు చేయాలి. కాబట్టి అంతర పంటగా శీతకాలంలో తక్కువ సమయంలో, ఎక్కువ దిగుబడిని ఇచ్చే కాలిఫ్లవర్‌ను సాగు చేయడం లాభదాయకం. ఈ విధానంలో మొక్కలకు తప్ప పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. మిర్చి దిగుబడి ప్రారంభమయ్యేలోపు కాలిఫ్లవర్ చేతికొస్తుంది. ఆ తర్వాత తీగజాతి పంటలు సాగు చేసుకోవచ్చు. ఇలా ఏడాది పొడవునా, పంటలను మారుస్తూ మంచి దిగుబడి, అధిక రాబడి సాధించవచ్చు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఒక పంటలో నష్టం వాటిల్లినా, మరో పంట రైతులను ఆదుకుంటుంది.
సాగు ఇలా..
ఎకరాకు 7,500 మొక్కలు అవసరం. పెట్టుబడి రూ.40 వేల నుంచి రూ.60 వేలు అవుతుంది. ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల దిగుబడి వస్తుంది. టన్ను రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. పంట నాటిన 45-60 రోజుల్లో దిగుబడి మొదలవుతుంది.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

