కోళ్లలో వచ్చే వ్యాధుల్లో మారెక్స్ ఒకటి. ఇది అన్ని వయసు కోళ్లకూ వస్తుంది. ఈ వ్యాధికి గురైన కోళ్లలో రెక్కలు వాలిపోవడం, సరిగా నిలబడలేక పోవడం, పక్షవాతం వచ్చి కదలలేకపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రెక్కల కింద ఉండే బ్రేకియల్ నరంతోపాటు తొడకండరాల కింద ఉండే సియాటిక్ నరం ఉబ్బి లావుగా తయారవుతాయి. కాలేయం, వెన్నెముక, అండాశయం పెద్దవిగా మారుతాయి. వ్యాధి సోకిన కోళ్లు 5 నుంచి 60 శాతం దాకా మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణకు పిల్లలు పుట్టిన రోజునే టీకాలు వేయించాలి. అయితే, కోళ్లలో జబ్బు కనిపిస్తే.. మిగతా కోళ్లకు టీకాలు వేయకూడదు.