నగరంలో అతిపెద్ద షాపింగ్ పండుగ అధికారికంగా ప్రారంభం కానుంది! లులు మాల్ కూకట్పల్లి, హైదరాబాద్ .తన అద్భుతమైన ‘లులు ఆన్ సేల్ (LULU ON SALE) పండుగకు సర్వసన్నద్ధమవుతోంది.
జులై 9 నుండి జులై 12, 2026 వరకు జరిగే ఈ నాలుగు రోజుల షాపింగ్ హంగామాను మీ క్యాలెండర్లో ఇప్పుడే నోట్ చేసి పెట్టుకోండి. ఈ సేల్‌లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ (Flat 50% Off) లభించనుంది. ఈ ఏడాది అతిపెద్ద షాపింగ్ వేడుకలలో ఒకటిగా నిలవడమే కాకుండా, మాల్‌కు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఒకే ప్రాగణం కింద 200కు పైగా ప్రముఖ బ్రాండ్లు ఈ సేల్‌లో పాల్గొంటున్నాయి. మాల్ యాజమాన్యం ధరలను భారీగా తగ్గించింది. ప్రతి కేటగిరీలోనూ వినియోగదారులు ఫ్లాట్ డిస్కౌంట్లు, అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.
రిజిస్టర్డ్ ‘హ్యాపీనెస్ మెంబర్స్’ ఎవరైతే రూ. 2999/- లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేస్తారో, వారు లక్కీ డ్రా ద్వారా హ్యుందాయ్ Hyundai i20 కార్ గెలుచుకునే సువర్ణావకాశాన్ని పొందుతారు.
హైపర్‌మార్కెట్‌లోని గ్రోసరీస్ (నిత్యావసరాలు), ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్లయన్స్ కేటగిరీలలోని 25,000 కంటే ఎక్కువ ఉత్పత్తులపై ఫ్లాట్ 50% డిస్కౌంట్ వర్తిస్తుంది. ఫంటురాలో ఈ 4 రోజుల పాటు ప్రత్యేకమైన 100% బోనస్ సెలబ్రేషన్ ఆఫర్‌ను అందిస్తోంది. రూ. 2000/- లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు 100% బోనస్‌తో పాటు ఉచిత రైడ్స్ కూపన్లు కూడా లభిస్తాయి.
రిజిస్టర్డ్ హ్యాపీనెస్ మెంబర్లకు (లాయల్టీ కస్టమర్లు) జులై 8 నుంచే ఈ సేల్‌ను ముందుగా యాక్సెస్ చేసుకునే ప్రత్యేక అవకాశం ఉంది. షాపింగ్ చేసేవారి సౌకర్యార్థం ఈ నాలుగు రోజుల పాటు మాల్లోని స్టోర్లు ఉదయం 9:00 గంటల నుంచే తెరిచి ఉంటాయని లులు మాల్ యాజమాన్యం ప్రకటించింది. అదనపు పార్కింగ్ స్థలంతో పాటు కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశారు.