Tribal students | గిరిజన విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించం
Tribal students | ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్ అన్నారు.
నార్నూర్ : ఏజెన్సీ ప్రాంతంలోని ( Agency Area ) ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు (Tribal students) అన్యాయం జరిగితే సహించేది లేదని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్ ( Dadi rao) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల వద్ద గురువారం ఆయన మాట్లాడారు. కేజీబీవీ ( KGBV ) పాఠశాలలో సమస్యలతో పాటు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదని ఆరోపించారు.
ఇటీవల భోజనంలో పురుగులు రావడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై ఆదివాసి సంఘాల నాయకులు పాఠశాలకు వెళ్లి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుందామంటే పాఠశాల ప్రత్యేక అధికారి హిమబిందు అనుమతి లేదని తిప్పిపంపడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. అన్నంలో పురుగులు వస్తే పట్టించుకోవద్దా అంటూ ప్రశ్నించారు. జిల్లా ఉన్నత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీసీడీవోను సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, మండల అధ్యక్షుడు అర్కా గోవింద్, మాజీ సర్పంచ్ ఆత్రం పరమేశ్వర్, మేస్రం మోతిరామ్ తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

