శ్రీరాంపూర్, ఏప్రిల్ 15: మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓసీపీలతో పాటు భూగర్భ గనులు నిప్పు ల కుంపటిని తలపిస్తున్నాయి. నాలుగు రో జులుగా శ్రీరాంపూర్ ఏరియాలో 41 నుం చి 44 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భగ భగ మండే ఎండతో పాటు వడగాలులతో పని ప్రదేశా ల్లో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల రక్షణ కోసం యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మంచిర్యా ల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, జైపూ ర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్, సిమెంట్ పరిశ్రమలున్న ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇక్కడి ఉపరితల గను లు 60 నుంచి 160 మీటర్ల వరకు లోతులో ఉన్నాయి. ప్రతి 40 మీటర్ల లోతుకు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఇక్కడ సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉ ష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. జైపూర్లోని బొగ్గు ఆధారిత సింగరేణి వి ద్యుత్ కేంద్రంతో పాటు ఓసీపీల్లో పేలుళ్లకు వాడే పదార్థాల నుంచి కర్భన ఉద్గారాలు, భారీ యంత్రాల నుంచి వచ్చే వేడి కూడా అధిక ఉష్ణోగ్రతకు కారణమవుతున్నది.
ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులకు వడదెబ్బ తగలకుండా చలువ పందిళ్లు వేయ డం, స్ప్రింక్లర్లతో నీటిని చల్లడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మధ్యాహ్నం మజ్జిగ, రెండు కూ ల్ క్యాన్లు అందించడం, డంపర్లు, షవల్స్, ఇతర భారీ వాహనాలకు, క్రషర్రూం, ప్రీవేబిన్ గదులకు ఏసీ సదుపాయం కల్పించడం, చల్లని తాగునీరు అందుబాటులో ఉంచడం, హెల్మెట్లు, కూలింగ్ జాకెట్లు అం దించాల్సి ఉన్నది. వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఎండల దృష్ట్యా మధ్యాహ్నం ఒం టి గంట నుంచి సాయంత్రం 4 గంటల మ ధ్య ఉపరితల గనుల్లో కార్మికులతో పని చేయించవద్దని కోరుతున్నా సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తున్నదని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్ ఆరోపించారు.
