బేల, జనవరి 19 : ఆదివాసుల సంస్కృతీ సంప్ర దాయాలు గొప్పవని, ఆదివాసీ గిరిజన గ్రామాల్లో వెలిసిన పురాతన ఆలయాలను అభివృద్ధి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. బేల మండలం సదల్పూర్ జంగి జాతరలో గురువారం నిర్వహించిన ఆదివాసీ గిరిజన దర్బార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జోగురామన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదివాసులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో చేపడుతున్న పథకాలను కేంద్రంలో అధికారం లో ఉన్న మోదీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదని మండి పడ్డారు. అలాగే సదల్‌పూర్‌లోని ఆలయ ఆవరణలో దాదాపు రూ. 2 కోట్లతో ఇది వరకే అభివృద్ధి చేశారని మిగితా పనులు కూడా దశల వారీగా చేపడుతామని పేర్కొ న్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జోగురామన్నను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు ప్రమోద్ రెడ్డి,లింగరెడ్డి, వేణుగోపాల్ యాధవ్, మస్కేతేజ్రావు, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, ఆదివాసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాటన్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అబ్దుల్ తన్వీర్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పరామ ర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆయా చోట్ల డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు ప్రమోద్ రెడ్డి, లింగారెడ్డి, వేణుగోపాల్ యాదవ్, మస్కేతేజ్ రావు, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు తన్వీర్‌ఖాన్, దేవన్న, లింగరెడ్డి, మెట్టు ప్రహ్లాద్, మంగేశ్ ఠాక్రే, స్థానిక సర్పంచ్ ఫైజూల్లాఖాన్ తదితరులు ఉన్నారు.