ఆసిఫాబాద్, జనవరి 27 : జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సురేశ్‌కుమార్ పోలీస్ అధికారుల సంఘం క్యాలెండర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు కమిటీలు వేసుకొని కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
పోలీస్ ఉద్యోగులకు రావాల్సి బెన్ఫిట్స్ను వీలైనంత త్వరగా అందించేందుకు కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు. అదనపు కలెక్టర్ అచ్చేశ్వర్రావు, సంఘం అధ్యక్షుడు విజయశంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు స్వామి, సంయుక్త కార్యదర్శి బిజీమాన్, ఆర్ఐలు పెద్దన్న,అంజన్న, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.