వాడవాడలాపూల వసంతం
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు సాయంత్రం వేళ ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. కోలాటాలతో హోరెత్తించారు.
- వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- ప్రధాన కూడళ్లలో ఆడిపాడిన మహిళలు
కోలాటాలతో అలరించిన యువతులు - వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ సంతోషం
- పోయిరా గౌరమ్మా.. అంటూ వీడ్కోలు
- పాల్గొన్న ప్రజాప్రతినిధులు
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు సాయంత్రం వేళ ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. కోలాటాలతో హోరెత్తించారు. కాగజ్‌నగర్ పట్టణంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సతీమణి రమాదేవి వేడుకల్లో పాల్గొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్, సబ్ జైల్, పొట్టిశ్రీ రాములు చౌక్, పైకాజీనగర్‌లో మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం పెద్దవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ స్వామి ఆలయం, గౌతమినగర్ కోదండరామాలయం, సాయిబాబా ఆలయం, తెలంగాణ చౌరస్తా, రెడ్డికాలనీ, ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ప్రధాన కూడళ్లు, అపార్ట్మెంట్ల వద్ద బతుకమ్మ ఆడారు. యువతులు డీజే చప్పుళ్ల నడుమ.. కోలాటా నృత్యాలతో హోరెత్తించారు. రాళ్లవాగు, రాముని చెరువు, హమాలీవాడ కట్టపోచమ్మ చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకొని.. పసుపు, కుంకుమలను పెట్టుకున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ, కౌన్సిలర్లు, నాయకులు బతుకమ్మల వేడుకల్లో పాల్గొన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని తిలకించారు. ఆయా చోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

