సీసీసీ నస్పూర్ : మంచిర్యాల జిల్లా నస్పూర్లో (Naspur) ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధమైంది. సిసిసి కార్నర్ సమీపంలోని రిలయన్స్ మార్ట్ పక్కన ఉన్న గ్యాస్ వెల్డింగ్ షాప్(Welding Shop) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీకి (Scooty ) గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే మంటలను ఆర్పివేశారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు.