బసవన్నల హోరు.. సంక్రాంతి సందడి షురూ
సంక్రాంతి పండుగకు సందడి చేసే గంగిరెద్దులు వచ్చేశాయి. ‘అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి సలాం కొట్టు..’ అంటూ ఆట ముచ్చటగొల్పింది. గంగిరెద్దుల కులస్తుల సన్నాయిల చప్పుడుకు బసవన్నలు చేసే ఆకట్టుకుంటున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలిచ్చే కానుకలను స్వీకరిస్తూ గంగిరెద్దుల కులస్తులు ఆశీర్వచనాలు అందిస్తున్నారు
దస్తురాబాద్, జనవరి 4 : సంక్రాంతి పండుగకు సందడి చేసే గంగిరెద్దులు వచ్చేశాయి. ‘అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి సలాం కొట్టు..’ అంటూ ఆట ముచ్చటగొల్పింది. గంగిరెద్దుల కులస్తుల సన్నాయిల చప్పుడుకు బసవన్నలు చేసే ఆకట్టుకుంటున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలిచ్చే కానుకలను స్వీకరిస్తూ గంగిరెద్దుల కులస్తులు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బసవన్నల సందడి కనిపిస్తున్నది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వారు గంగిరెద్దులు, గొర్రె పొట్టేళ్లతో చేసే విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి. కాగా.. గ్రామాల్లో గంగిరెద్దుల సందడి, కోలాహలంతో సంక్రాంతి అప్పుడే మొదలైనట్లు కనిపిస్తున్నది. ఇంకా 10 రోజుల సమయం ఉన్నా పల్లెలు పండుగ శోభను సంతరించుకున్నాయి. గంగిరెద్దుల కులస్తులు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరు డోలు వాయిస్తూ గుమ్మాల దగ్గర గంగిరెద్దులతో ప్రదర్శన చేయిస్తూ యాచిస్తుంటారు. ప్రజలు వారి స్థాయికి తగ్గుట్టు డబ్బులు, బియ్యం, వడ్లు ఇతర వస్తువులను దానం చేస్తుంటారు. వీటిని స్వీకరించిన వారు.. ప్రజలను ఆశీర్వదిస్తారు. ఇలా సంక్రాంతి సందడి ముగిసే వరకు ఆయా గ్రామాల్లో తిరుగుతూ.. వచ్చిన డబ్బులు, సామగ్రితో స్వగ్రామానికి తిరుగు పయనమవుతారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

