Sadhguru Phulaji Baba | ‘ఆధ్యాత్మిక సన్మార్గాన్ని చూపిన మహనీయుడు సద్గురు పూలాజీ బాబా’
Sadhguru Phulaji Baba | పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక, ధ్యాన సన్మార్గాలు ఎంతో గొప్పవన్నారు ఆదిలాబాద్ ఎంపీ నగేష్. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో బాబా ప్రవచనాలు, బోధనల వల్ల ఎన్నో కుటుంబాలు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయని తెలిపారు.
Sadhguru Phulaji Baba | జైనూర్, ఆగస్టు 30 : శ్రీశ్రీశ్రీ సద్గురు పూలాజీ బాబా ప్రవచనాలు, ధ్యాన బోధలు స్ఫూర్తిదాయకమని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గొడం నగేష్ అన్నారు. శనివారం జిల్లాలోని జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలో గల సిద్దేశ్వర సంస్థాన్‌లో నిర్వహించిన పూలాజీ బాబా 101వ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాష్, కిన్వాట్ (మహారాష్ట్ర)నియోజకవర్గ శాసనసభ్యులు భీమ్ రావు కేరం, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులతో హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ మాట్లాడుతూ.. పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక, ధ్యాన సన్మార్గాలు ఎంతో గొప్పవన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో బాబా ప్రవచనాలు, బోధనల వల్ల ఎన్నో కుటుంబాలు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆధ్యాత్మిక సన్మార్గాన్ని చూపిన మహనీయుడని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పూలాజీ బాబా ప్రజల జీవితాలలో మార్పు రావాలని చేసిన ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయమని, మహనీయులు అందించిన బోధనలు ముందు తరాల వారికి అందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రజలంతా ఆధ్యాత్మిక శాంతి మార్గంలో నడవాలని, మానవ సేవయే మాధవ సేవగా పులాజీ బాబా కృషి చేశారని తెలిపారు.
ఆధ్యాత్మిక మార్గాలపై ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాటు..
ప్రతి మనిషి పని చేసుకుంటూ తాను అనుకున్న పనులు అవుతాయనే నమ్మకంతో సన్మార్గంలో నడవాలని తెలిపారు. పూలాజీ బాబా తపస్సు చేసిన దామాజీ లోయకు రోడ్డుతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కృషి చేస్తామని తెలిపారు. పూలాజీ బాబా జయంతి వేడుకలకు హాజరైన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఆధ్యాత్మిక మార్గాలపై ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాటు, అధిక సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుశాఖ సమన్వయంతో బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
అనంతరం సద్గురు పూలాజీ బాబా జీవిత చరిత్ర, ప్రవచనాల ధ్యానమార్గాలపై మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ కొటు కులే, భక్తురాలు కమల రచించిన గ్రంథాలను, క్యాసెట్‌ను ఆవిష్కరించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ప్రత్యేక ఉపపాలన అధికారి రాందాస్, ఆదిలాబాద్ డీఎస్పీ రఘునాథ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, ఉట్నూర్ పి.వి.పి.జి. ఎ.పి.ఓ. మెస్రం మనోహర్, మహారాష్ట్ర మాజీ మంత్రి శివాజీ రావు, మాజీ శాసనసభ్యుడు ఉత్తం రావు ఇంగ్లె, జైనూర్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాధ్ రావు, ఉత్తం రావు, ఆదిలాబాద్ గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, ఆసిఫాబాద్ విద్యుత్ శాఖ ఎస్.ఈ శేషరావు సంబంధిత శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులు, సిద్దేశ్వర సంస్థాన్ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
Read Also :
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

