ఐదేళ్లలోపు పిల్లలు.. మూడు డోసులు
ఐదేళ్లలోపు చిన్నారుల్లో వచ్చే డయేరియా అతి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. ఇది రోటా అనే వైరస్ కారణంగా వస్తుంది. దశాబ్దకాలం ముందు ఈ వ్యాధితో మరణాల రేటు తీవ్రంగా ఉండేది. దీంతో 1998లో రోటా వైరస్ నియంత్రణకు యూఎస్‌లో లైసెన్సులు తీసుకొని పరిశోధనలు ప్రారంభించారు
- రోటావైరస్ వ్యాక్సిన్‌తో డయేరియా దూరం
- ఉచితంగా టీకాలు వేస్తున్న ప్రభుత్వం
- తగ్గిన బాధిత కేసులు, శిశు మరణాలు
ఎదులాపురం, నవంబర్ 20 : ఐదేళ్లలోపు చిన్నారుల్లో వచ్చే డయేరియా అతి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. ఇది రోటా అనే వైరస్ కారణంగా వస్తుంది. దశాబ్దకాలం ముందు ఈ వ్యాధితో మరణాల రేటు తీవ్రంగా ఉండేది. దీంతో 1998లో రోటా వైరస్ నియంత్రణకు యూఎస్‌లో లైసెన్సులు తీసుకొని పరిశోధనలు ప్రారంభించారు. 2006లో రోటా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
అనేక పరిశోధనల అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని ముఖ్య, కచ్చితమైన మందుల జాబితాలో రోటా వైరస్ వ్యాక్సిన్‌ను గుర్తించారు. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాల జాబితాలో దీనిని చేర్చారు. నవజాత శిశువుల వయస్సులోనే మూడు నిర్ణీత వారాల్లో రోటా వైరస్‌ను పిల్లలకు ఇవ్వగలిగితే వారు భవిష్యత్‌లో డయేరియా నుంచి బయటపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన పలు సర్వేల్లో తేలింది.

ఏటా తగ్గుతున్న డయేరియా కేసులు
రోటావైరస్ వ్యాక్సిన్‌ను శిశువులకు నియమిత టీకా సమయ పట్టికను అనుసరించి ఇస్తారు. ఇతర టీకాలతో పాటు, 6, 10, దీనివల్ల 14వ వారాల పిల్లలకు ఇస్తారు. 2020లో 2,966 కేసులు నమోదుకాగా, 2021 సంవత్సరంలో 2,365, ఈ ఏడాది ఇప్పటి (అక్టోబర్) 2,084 వరకు నమోదయ్యాయి.
రోటా వైరస్ అంటే..
రోటా వైరస్ తీవ్ర ఇన్ఫెక్షన్ను కల్గించే వైరస్. పిల్లలకు నీళ్ల విరేచనాలు అవుతాయి. తర్వాత తీవ్రత పెరుగుతుంది. సరైన వైద్యం అందక పోతే శరీరంలోని నీరు, లవణాలు తగ్గిపోయి, కొన్ని సార్లు పిల్లలు మృతి చెందే అవకాశం ఉంటుంది. రోటా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 3 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. రోటా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్ర నీళ్ల విరేచనాలతో పాటు జ్వరం, వాంతులు కూడా కావచ్చు. కొన్ని సార్లు కడుపులో నొప్పి కూడా ఉంటుంది. విరేచనాలు, మిగతా లక్షణాలు 3 నుంచి 7రోజుల వరకు ఉంటాయి. రోటా వైరస్ విరేచనాల కారణంగా జరిగే మరణాల్లో సుమారు 50 శాతం మరణాలు ఏడాది లోపు పిల్లలవే. అంతేకాక 75 శాతం మరణించే పిల్లలు మొదటి రెండేళ్లలోపు వయస్సు వారే. పోషకాహార లోపం ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం పూర్తిగా చేయించకపోతే విరేచనాలు తీవ్రరూపం దాల్చి ఫలితంగా పిల్లలు మరణించే అవకాశం ఉంది.
రోటా వైరస్ వ్యాప్తి, నిర్ధారణ, చికిత్స ఇలా..
రోటా ఒక తీవ్ర ఇన్ఫెక్షన్ కలిగించే వైరస్. కలుషితమైన నీరు, ఆహారం, అపరిశుభ్రమైన చేతుల వల్ల వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఎన్నో గంటల పాటు పిల్లల చేతుల్లో , ఇతర గట్టి ఉపరితలాల్లో ఎక్కువ సమయం జీవిస్తుంది. ల్యాబోరేటరీలో నిర్ధారిత పరీక్షల ద్వారా ఈ వైరస్‌ను గుర్తిస్తారు. రోటా వైరస్‌తో కలిగే విరేచనాలకు కచ్చితమైన చికిత్స ఏదీ లేదు. పిల్లలకు ఓఆర్ఎస్, 14రోజుల వరకు జింక్ టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా కొంత ఉపశమనం ఉంటుంది. రోటా వైరస్ సంక్రమణ పదే పదే ఉండవచ్చు. కానీ తీవ్రత అంతగా ఉండదు. వ్యాక్సిన్ వేయించడమే దీనికి ప్రధాన ఉపశమనంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాక్సిన్ తప్పనిసరి
డయేరియా నుంచి పిల్లలను కాపాడేందుకు రోటా వైరస్ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు 6, 10, 14 వారాల్లో మూడు దఫాలుగా వేస్తారు. జిల్లా వ్యాప్తంగా వైద్యసిబ్బంది వ్యాక్సిన్ క్రమం తప్పకుండా వేస్తున్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పిల్లల్లో డయేరియా మరణాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి.
– జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

