రోడ్లకు మరమ్మతులు చేయాలి
భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లికి వెళ్లేదారిలో ఉన్న లోతొర్రె లోలెవల్ వంతెన ధ్వంసం కాగా కలెక్టర్ పరిశీలించి ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడారు.
- రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి
- అధికారులకు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
కోటపల్లి, జూలై 22 : భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లికి వెళ్లేదారిలో ఉన్న లోతొర్రె లోలెవల్ వంతెన ధ్వంసం కాగా కలెక్టర్ పరిశీలించి ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడారు. ధ్వంసమైన రహదారులు, వంతెనలకు మరమ్మతు చేయాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కోటపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. హాజరు రిజిష్టర్లు, రికార్డులను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాల దృష్ట్యా గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు. అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, వార్డులను పరిశీలించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. అనంతరం కోటపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణ రెడ్డి, నక్కలపల్లి పంచాయతీ కార్యదర్శి మద్ది శివకృష్ణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
-రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్
కోటపల్లి, జూలై 22 : ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ సూచించారు. మంగళవారం కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు వంతెన, అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్‌ను ఆయన పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. సహాయక చర్యల కోసం బోట్, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన డీడీఆర్ఎఫ్ (డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పోలీసు టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏవైనా ఇబందులుంటే డయల్ 100 కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాసర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

