ఆదర్శ ఉపాధ్యాయుల ఆందోళన బాట
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నేటి(సోమవారం) నుంచి 29వ తేదీ వరకు ఆందోళన బాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలు రూపొందించారు.
- నేటి నుంచి 29 వరకు నిరసన కార్యక్రమాలు
దండేపల్లి, జూన్ 23 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నేటి(సోమవారం) నుంచి 29వ తేదీ వరకు ఆందోళన బాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలు రూపొందించారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 ఆదర్శ పాఠశాలలు ఉండగా, 160 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
ఆదర్శ ఉపాధ్యాయుల డిమాండ్లు..
- బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి.
- 010 పద్దు ద్వారా వేతనం చెల్లించాలి.
- హెల్త్ కార్డులు జారీ చేయాలి.
- ఉద్యోగ భద్రత కల్పించాలి.
- హిందీ పీజీటీ పోస్టు ఏర్పాటు చేయాలి.
- పీజీటీలను జేఎల్లుగా ఉన్నతీకరించాలి.
- ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
- కారుణ్య నియామకాలు చేపట్టాలి.
నిరసన కార్యక్రమాలు..
- ఈనెల 24న నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం. l 25, 26 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనతోపాటు సీఎంవో విద్యాశాఖ కార్యదర్శికి ట్విట్టర్లో పోస్ట్ చేయడం.
- 27న తహసీల్దార్, మండల విద్యాధికారు లకు వినతిపత్రాల అందజేత.
- 28న కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, 29న పాఠశాల విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించడం.
ధర్నాకు దిగుతాం..
నేటి నుంచి 29 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కొన్నేళ్లుగా కోరుతున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే ధర్నాకు దిగుతాం.
– ఎత్రజ్ రాజు, జిల్లా మోడల్ స్కూల్ అసోసియేషన్ కన్వీనర్.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

