తాండూర్ : అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని బెల్లంపల్లి సీడీపీవో (CDPO ) స్వరూపరాణి (Swarooparani) తెలిపారు. మంగళవారం తాండూర్(Tandoor) మండలం రేచిని రైల్వే స్టేషన్ అంగన్వాడీ కేంద్రాన్ని (Anganwadi Center) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం పంపిణీ, ప్లే స్కూల్ నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
గర్భీణులకు, పిల్లలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో గృహ సందర్శనలు నిర్వహించి గర్భిణీలకు ఆహార నియమాలను గురించి వివరించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్లే స్కూల్ ద్వారా పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఉన్నారు. మాదారం అంగన్వాడీ కేంద్రం పరిధిలో అంగన్వాడీ టీచర్ మీనా గృహ సందర్శన చేపట్టారు. పౌష్టికాహారం, ఆరోగ్యం, ఆహార నియమాల పట్ల గ్రామస్థులకు అవగాహన కల్పించారు.