చెన్నూర్ రూరల్/జన్నారం/కౌటాల/సిర్పూర్(యూ)/నెన్నెల/వేమనపల్లి/తిర్యాణి/మందమర్రి/ కాసిపేట/ భీమారం/ ఆసిఫాబాద్ టౌన్/చింతలమానేపల్లి, జూన్ 1 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని మాజీ సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలువురు నాయకులను సోమవారం ఉదయమే ఇండ్ల వద్ద ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్‌లతో ప్రజలు, ప్రతిపక్షనాయకుల గొంతు నొక్కలేరని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులను ఇప్పటివరకూ కాంగ్రెస్ సర్కారు చెల్లించలేదన్నారు. అధికారంలో వచ్చి రెండున్నరేళ్లయినా ఇప్పటి వరకూ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని, అన్యాయాలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. చెన్నూర్ మండలంలో అరెస్ట్‌యిన వారిలో మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెల దామోదర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రేవల్లి మహేశ్, దోమకొండ అనిల్, జోడు శంకర్, బీఆర్ఎస్ నాయకులు అయిత సురేశ్ రెడ్డి, మానిశెట్టి శ్రీనివాస్, మేడ సురేశ్ రెడ్డి, పోలు రవీందర్ గౌడ్, తిరుపతి, సురేశ్, భారతీ తదితరులు ఉన్నారు. జన్నారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రదాన కార్యదర్శి సులువ జనార్దన్, ఫజల్‌ఖాన్,బాలసాని శ్రీనివాస్‌గౌడ్, వోలాల నర్సగౌడ్, ఐలవేణి రవి, పురుషోత్తం, సాయి కిరణ్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నెన్నెల మండలంలో అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్ గౌడ్, నందులపల్లి మాజీ సర్పంచ్ మల్లేశ్ ఉన్నారు.
వేమనపల్లి మండలంలో అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పురాణం లక్ష్మీకాంత్, నాయకులు సుధాకర్, సంతోష్, మొండి, మధుకర్, బాపు, పున్నం, ప్రసాద్ తదితరులు ఉన్నారు. మందమర్రి పట్టణంలో అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వేల్పుల రవి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు లౌడం రాజ్‌కుమార్, బీఆర్ఎస్వై, బీఆర్ఎస్వీ నాయకులు ఎండీ.ఫిరోజ్, తోట సురేందర్, దాసరి నవీన్, సీపెల్లి సాగర్, మాసు వెంకటేశ్, అందె శ్రీకాంత్, ఎండి.పాషా ఉన్నారు. కాసిపేట మండలంలోఅరెస్ట్యిన వారిలో లంబాడీతండా(డీ) మాజీ సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్, రొట్టెపల్లిలో బీఆర్ఎస్ పెంద్రం హన్మంతు ఉన్నారు. భీమారం మండలంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్మారం సర్పంచ్ దాసరి మణిదీపక్, నాయకులు గుడిమల్ల వెంకన్న, సుంకరి గోపాల్, భూక్యా రాజ్ కుమార్ నాయక్, వేముల శ్రీకాంత్ గౌడ్, ఆత్కూరి రాము, సుంకరి భూమేశ్, నరేశ్ తదితరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఆసిఫాబాద్ జిల్లాలో..
బీఆర్ఎస్ ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు, గుండి సర్పంచ్ జాబరి రవీందర్ సిర్పూర్ టౌన్ పరిధిలో సీఐటీయూ జిల్లా జాయింట్ సెక్రటరీ కృష్ణమాచారి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నందాజీ, ముఖ్య కార్యకర్తలను అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. కౌటాల మండలంలోని సీఐటీయూ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు జాడి మోరేశ్వర్, జిల్లా కార్యదర్శి మోర్లె నాగేశ్, ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వసంత్ రావు, ఉపాధ్యక్షుడు బాజీరావును అరెస్టు చేశారు. సిర్పూర్(యూ) మండలంలో అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ సిర్పూర్(యూ)మండల అధ్యక్షుడు తొడసం ధర్మరావు, సర్పంచులు ఆత్రం ఓంప్రకాశ్, కుంర భీంరావు, తో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు.
తిర్యాణి మండలంలో అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మాండ్ల జగదీశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, సీనియర్ నాయకుడు ముత్యం రాజయ్య, మాజీ జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ తదితరులున్నారు. చింతలమానేపల్లి మండలంలోని దిందా పోడు రైతులు, మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోమాసి లహంసు, పోడు రైతులు దన్నురి లస్మయ్య, మహేశ్, నాని, ఎల్కారి తిరుపతి, రాకేశ్, డాగే సురేశ్, అంకులు, ఇంగాని ఆగయ్య, హన్మంతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
