ఖానాపూర్, జూలై 19 : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. రైతులు, ప్రజల అజాగ్రత్త.. అవగాహన లోపంతో ప్రజలు, మూగజీవాలు విద్యుత్ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా విద్యుత్ వైర్లు సరిచేస్తూ, పొలల్లో మోటర్ల వద్ద కరెంటు షాక్‌కు గురై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా అధికారులు నామమాత్రంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ తూతూ మంత్రంగానే చేపడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందుకు ఇటీవల జరుగుతున్న సంఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. పొలాల్లో పశువులకు విద్యుత్ తీగలు,ట్రాన్స్ఫార్మర్లు యమపాశాలుగా మారుతున్నాయి.

యమపాశాలుగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు..
ఇళ్లు, పొలాల్లో విద్యుత్ ప్రమాదాల రూపంలో మృత్యువు పొంచి ఉంది. విద్యుత్ వైర్లు సరిచేస్తూ, వ్యవసాయ క్షేత్రాల్లో, పశువులు మేతకు వెళ్లి విద్యుత్ ప్రమాదాల బారిన పడడం ఇలా ఏదో ఒక చోట విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. సామాన్య ప్రజలకే కాకుండా విద్యుత్ సిబ్బంది ప్ర మాదాల బారిన పడిన ఘటనలున్నాయి. ఇటీవల కాలంలో ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, కడెం మండలాల్లో విద్యుత్ ప్రమాదాల్లో మూగజీవాలతోపాటు మనుషులు మృత్యువాత పడ్డారు. ఇళ్లపై విద్యుత్ తీగలు, పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ కంచెలు లేకపోవడం, లూజ్లైన్లు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మా రుతున్నాయి. విద్యుత్ భద్రతా వా రోత్సవాలు పకడ్బందీగా చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవశ్యకత ఉంది.
విద్యుత్ సిబ్బంది సహకారం తీసుకోవాలి
వర్షాకాలంలో జరిగే విద్యుత్ ప్రమాదాలపై ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నాం. విద్యుత్ సిబ్బందికి తగిన సూచనలు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ పరికరాలు, మోటర్లు రిపేర్ చేసేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకుండా సిబ్బంది, అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా వాటిని సరి చేసుకోవాలి. విద్యుత్ సమస్యలు ఏమై నా ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 1912కు ఫోన్ చేయాలి. పశు వులను మెతకు తీసుకెళ్లే వ్యక్తులు పశువులను ట్రాన్స్ఫార్మ ర్లకు దూరంగా ఉంచాలి. విద్యుత్ సరాఫరాలో హెచ్చు తగ్గులుంటే వెంటనే పరికరాలను అఫ్చేసి విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. – రాంసింగ్, విద్యుత్ శాఖ ఏఈ, ఖానాపూర్.

ఖానాపూర్ నియోజకవర్గంలో జరిగిన ఘటనలు..
ప్రజలు..
పశువులు..