అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
చెన్నూర్ నియోజకవర్గంతో పాటు పట్టణంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్కే అభ్యర్థి బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని 11వ వార్డు నడిమిగూడెంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకానితో కలిసి ఇంటింట ప్రచారం చేశారు.
- చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్
- ఎంపీ వెంకటేశ్‌తో కలిసి 11వ వార్డులో ప్రచారం
చెన్నూర్, నవంబర్ 10 : చెన్నూర్ నియోజకవర్గంతో పాటు పట్టణంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్కే అభ్యర్థి బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని 11వ వార్డు నడిమిగూడెంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకానితో కలిసి ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రూ.వంద కోట్లతో చేపట్టిన అభివృద్ధి మీ కళ్లముందే ఉందన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మారెమ్మవాడకు రూ 5.70 కోట్లతో రోడ్డు, బైరిసత్తయ్య ఇంటి నుంచి జాతీయ రహదారి వరకు రూ 3.20 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు.
రూ. 4 కోట్లతో అనంతయ్యకుంటను మినీ ట్యాంకు బండ్‌గా తీర్చి దిద్దామని తెలిపారు. వార్డుల పరిధిలోని అంతర్గత రహదారుల ని ర్మాణం కోసం నిధుల మంజూరయ్యాయని చెప్పారు. చెన్నూర్ పట్టణాన్ని గతంలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్‌లో విద్యుత్ కష్టా లు ఉండవద్దనే ఉద్దేశంతో రూ.కోటితో ఇదే వార్డు పరిధిలో సబ్ స్టేషన్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కాలంలోనూ అభివృద్ధి ఆగలేదని, పెద్ద మొత్తంలో నిధులు తెచ్చి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్ దోమకొండ అనిల్, బీఆర్ఎస్ నాయకుడు పెండ్యాల లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

