8వరోజు అమ్మవారు మహాగౌరి రూపంలో దర్శనం

బాసర : బాసరలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వరోజు సరస్వతి అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం అమ్మవారికి ఆలయ అర్చకులు చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాగా దేవాదాయశాఖ కమిషనర్ అనీల్‌కుమార్, తోగుట పీఠాధిపతి మహానంద సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. బాసర చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులకు పూజ విధానంపై పీఠాధిపతి తగు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్ కమిషనర్‌ను కండువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం కమిషనర్ ఆలయ పరిసరాలను, మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏయే పనులు నిర్వహించాలో అధికారులను సూచించారు. భక్తులకు ఉపయోగపడేలా , ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి పనులను నిర్వహించాలని ఆదేశించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

