గంజి కేంద్రాలు పోయి..ధాన్యం కేంద్రాలు వచ్చాయి
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని సీఎం కేసీఆర్ అన్నారు.
- దళారీలను రూపుమాపేందుకే ధరణి
- కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపాలె
- పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ను దీవించాలె
- నాడు వలసపోయిన పాలమూరుకే .. నేడు వలసలొస్తున్నారు
- ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను సోమవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అయిజ రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
రాబంధులు, దళారీలను రూపుమాపేందుకే ధరణిని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతుబంధు, కరంటు, దళితబంధు ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు బతకలేక, బతుకులేక పాలమూరు నుంచి వలసపోయామని, కానీ ఇప్పుడు పక్కనున్న కర్నూల్ జిల్లా, రాయ్‌చూర్, బీహార్, జార్ఖండ్ నుంచి పాలమూరుకు వలస వస్తున్నారని తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధి కోసం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

