ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులకు కృషి
మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
- ఉత్తర తెలంగాణకు ఆర్థిక రాజధానిని చేస్తా
- మంచిర్యాల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలటౌన్, జూన్ 23 : మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేంపల్లి గ్రామ శివారులో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నానని,
అడుగగానే వేంపల్లి గ్రామస్తులు సంతోషంగా ముందుకు వచ్చారన్నారు. బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిపారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పుకొచ్చారు. మంచిర్యాల జిల్లాను ఉత్తర తెలంగాణకే ఆర్థిక రాజధానిగా చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల పట్టణాన్ని కార్పొరేషన్ చేస్తానని, మంచిర్యాల, నస్పూరు పట్టణాలు అమృత్ పథకంలో ఎంపికయ్యాయన్నారు.
కొలువుదీరిన మార్కెట్ కమిటీ పాలకవర్గం
మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆదివారం కొలువుదీరింది. మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి గజానన్.. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన పయ్యావుల పద్మ -ముని, వైస్ చైర్మన్ బండారి సుధాకర్, సభ్యులు ఎండీ తాజమ్ముల్ అహ్మద్, వొన్నోజుల శ్రీనివాస్, పల్లపు సా విత్రి, బదావత్ రమేశ్‌నాయక్, సూరంసతీశ్, తనుగుల సత్యనారాయణ, నారిశెట్టి సంతోష్, దోనేపల్లి లింగయ్య, ధర్ని మల్లేశ్, జనార్దన్, మహేశ్‌కుమార్ జాజు, రావుల మహేశ్, రామారావుల చేత ప్రమాణం స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన వారు ఎమ్మెల్యే పీఎస్సార్, డీసీసీ అధ్యక్షురాలు సురేఖను సన్మానించారు. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేశ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, హేమలత, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

